29-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు లో కరోనా పై అవగాహనా ర్యాలీ & మానవహారం
————————————————————
ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విన్నూత రీతిలో గొడుగులతో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి నుండి కేర్ పురం మీదుగా కరోనా పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు…
ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లాఅధికారుల ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ చేపడుతున్నామని తెలియజేశారు అధికారులు ఎంతో శ్రమ తీసుకొని కరోనా నివారణకు పాట్లు పడుతున్నా, ప్రజలు అవగాహనా రాహిత్యంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని… కావున కేవలం అధికారులే చర్యలు తీసుకుంటే సరిపోదు అని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి సహకరించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి గంటకు చేతులను శుభ్రం చేసుకోవాలని, తాగు నీరు ఎక్కువగా తాగాలని, ఎక్కువమంది ఒకచోట ఉండకూడదని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు
ప్రస్తుతం మనుబోలు మండల పరిధిలో అధికారుల పగడ్బందీ చర్యలతో కరోనా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు దాసరి మహేంద్ర వర్మ ,దువ్వూరు సుధాకర్ రెడ్డి మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిఅశోక్ కుమార్,పోలీస్ సిబ్బంది,సచివాలయ సిబ్బందిమరియు వాలంటీర్లుగ్రామప్రజలుపాల్గొన్నారు.