పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు కరోనా నివారణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రెండోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.