*కన్యకాపరమేశ్వరి ఆలయ జీర్ణోద్ధరణ*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
* గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్ ను స్ప్రుశించుకుని దర్శనం
* ఆవుతో దర్భముడితో విగ్రహం గవ్యాంత మార్జనలు
* జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ
* బాలాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన
విశాఖ నగరంలో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 149 సంవత్సరాల చరిత్ర గలిగిన దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ గావించి నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో అమ్మవారిని ప్రతిష్టించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు *శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి దోమా వెంకట బాలాజికుమార్* లు తెలిపారు.
విశాఖ నగరంలో రోడ్డు విస్తరణలో భాగంగా 2023వ సంవత్సరంలో దేవాలయానికి సంబందించి సుమారు 16 అడుగుల్లో గల ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం కోల్పోయిన కారణంగా పూర్తి ఆలయం పునర్నిర్మించవలసినందువల్ల అగనంపూడి వాస్తవ్యులు విద్వాన్ శ్రీ శ్రీ శ్రీ కొత్తలంక పల్లంరాజు గారి మార్గదర్శకత్వంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఆర్.బి.బి. కుమార్ శర్మ గారి నేతృత్వంలో ఆగమశాస్త్ర ప్రకారం విగ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, మర్జనలు, మండపారాధన, ప్రధాననకలశారాధన, త్రిశూలపూజ, కరణ్యాశములు, వాస్తుహోమం, వాస్తు బలి ఇత్యాది క్రతువులు నిర్వహించిన పిదప వాసవి అమ్మవారి మూలవిగ్రహ ఉద్వాసన (నిర్మూలన), ఆవుతో దర్భముడితో విగ్రహ గవ్యాంతమార్జనలు, బాలాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, వాసవి మూలమంత్ర హోమం, జీర్ణోద్దరణ మరియు కలాపకర్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ
సుమారు ఏడు కోట్ల రూపాయలతో నగర ఆర్యవైశ్య లబ్దప్రతిష్టులు, వ్యాపార ప్రముఖులైన పైడా కృష్ణ ప్రసాద్, కంకటాల మల్లిక్ ల సంయుక్త ఆధ్వర్యాన ఆర్యవైశ్యుల విరాళాలతో పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు మరియు భక్తులందరికీ మధ్యాహ్నం మహా అన్నప్రసాదం దేవాలయ కమిటీ అందజేశారు.


