ఏలూరు జిల్లా
బుట్టాయగూడెం మండలం
బుట్టాయగూడెం మండలం రాజానగరం పంచాయతీ పాత రాజానగరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెట్టి జయమ్మ కన్నాపురం నుండి పోలవరం వెళ్లే జంగారెడ్డిగూడెం బస్సు నుండి లక్ష్మీపురం వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గర ప్రమాదవాసాత్తు డోర్ వద్ద నుండి క్రిందకి పడి బస్సు వెనుక టైర్లు కుడి మోచేతి మీదనుండి ఎక్కి వెళ్లడం వలన ఆమె చెయ్యి పూర్తిగా పాడైపోయింది. స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురయ్యి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.ఉచిత బస్సు ప్రయాణం వలన ఒక బస్సులో పరిమితికి మించి ఆడవారిని ఎక్కించుకోవడం వలన ఇలా జరిగింది అని తోటి ప్రయాణికులు తెలియజేసారు. ఇరుకైన రోడ్డులో బస్సు డ్రైవర్ అతివేగం తో బస్సు నడపడం వల్ల సడన్ బ్రేక్ వేయడం వలన ప్రయాణికులు ఈ రోడ్డు మార్గం లో బస్సులు ఎక్కడానికి బయపడుతున్నారు.

