శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఈ ఉపాధి అవకాశాల జాతరను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్రతాంబూలం ఇస్తోందని కొనియాడారు. “మా నియోజకవర్గ యువత ఆర్థికంగా ఎదిగి, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నదే నా ఆశయం. అందుకే బొజ్జల జయంతి సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాము” అని ఆయన వెల్లడించారు. ఈ మేళాలో సుమారు 50కి పైగా ప్రముఖ బహుళజాతి కంపెనీలు (MNCs) పాల్గొంటున్నాయి. ఒకే వేదికపై 2000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఒకే వేదికపై 50 కంపెనీలు.. నిరుద్యోగులకు సువర్ణవకాశం-ఎమ్మెల్యే