గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పిలుపునిచ్చారు.
87వ వార్డులో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పోలియో నివారణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం పోలియో రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 87వ వార్డులో 19 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, బెల్లంకొండ రాజన్ రాజు, వర్రే రాంబాబు, కళ్లేపల్లి శ్రీనివాసవర్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


