శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్లో ప్రసారమవుతున్న “కొత్త పలుకు” కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజలు సమానంగా ఉన్నప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన స్పందన లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదును స్వీకరించి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ కార్యకర్తలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉన్నం వాసుదేవ నాయుడు, షేక్ సిరాజ్ భాష, కొగిలి సుబ్రహ్మణ్యం తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏబీఎన్ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం – ఆర్. కె.పై కేసు నమోదు చేయాలని డిమాండ్