*ఏపీలో కొత్త టీచర్లకు సెలవుల పై ప్రభుత్వం క్లారిటీ*
అమరావతి :
ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన 15,941 మంది కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది.
4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించు కోవచ్చని తెలిపింది.


