పున్నమి ప్రతినిథి ✒️
ఏపీలో ఇవాళ కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 1583 కి చేరుకున్నాయని వెల్లడించింది. కొత్తగా కర్నూలు జిల్లాలో 30,గుంటూరు జిల్లాలో 11,అనంతపురం జిల్లాలో 7,కృష్ణా జిల్లాలో 8,చిత్తూరు జిల్లాలో 1,నెల్లూరులో 1 నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం ఏపీలో యాక్టీవ్ కేసులు 1062 ఉన్నట్లు స్పష్టం చేసింది.