ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు సులభతరం చేసేందుకు మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనుంది.
“మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఈ సేవను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రజలు ఇకమీదట మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా, వాట్సాప్‌లోనే నేరుగా తమ కుల ధృవీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
ప్రస్తుతం ఈ సదుపాయం అమలుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు జరుగుతున్నాయి. అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుంది.


