2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్లోని 164 ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న జరిగే ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన వారు ఉచితంగా ఆంగ్ల మాధ్యమ బోధన పొందవచ్చు.


