Thursday, 12 February 2026
  • Home  
  • ఏటికొప్పాకలో సేవా దీప్తి – ఉచిత కళ్లద్దాలతో ప్రజలకు ఆనందం..!
- అనకాపల్లి

ఏటికొప్పాకలో సేవా దీప్తి – ఉచిత కళ్లద్దాలతో ప్రజలకు ఆనందం..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 12, పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన దాదాపు 70 మంది లబ్ధిదారులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ గారి చేతుల మీదుగా కళ్లద్దాలు అందజేయడం విశేషంగా నిలిచింది. గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రి సింహాచలం, వార్డ్ మెంబర్స్ నాయుడు మాస్టర్, ఇసరపు శ్రీను, ఎర్రంచెట్టి శ్రీను, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన దృష్టి, ఆరోగ్య అవగాహన కలిగించడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 12, పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్:

ఏటికొప్పాక గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన దాదాపు 70 మంది లబ్ధిదారులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ గారి చేతుల మీదుగా కళ్లద్దాలు అందజేయడం విశేషంగా నిలిచింది. గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రి సింహాచలం, వార్డ్ మెంబర్స్ నాయుడు మాస్టర్, ఇసరపు శ్రీను, ఎర్రంచెట్టి శ్రీను, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన దృష్టి, ఆరోగ్య అవగాహన కలిగించడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.