పున్నమి ప్రతి నిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ ని అదుపులో కి తీసుకోని అయన పై ఏసీబీ కేసునమోదు చేసిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో జరిగింది
వివరాల్లోకి వెళితే
భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.


