ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం కాట్రకాయలగుంట గ్రామంలో కోకా కోలా కంపెనీ సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ స్కూల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించడం ఎంతో అవసరమని, అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. కోకా కోలా సంస్థ సి ఎస్ ఆర్ కార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నైనూరు పున్నారావు, ఏర్పేడు పాక్స్ ఛైర్మన్ మహేష్ రెడ్డి, సి ఎస్ ఆర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ షైక్ ఖలీల్ బాషా, పి ఎసి ఆఫీసర్ నిటేష్ ( హెచ్ సి సి బి), సిడిపిఓ కృష్ణవేణి, సూపర్‌వైజర్ రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బొజ్జల సతీమణిచే అంగన్వాడీ భవనం ప్రారంభం