Wednesday, 18 February 2026
  • Home  
  • ఎదులాపురం మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపిక
- ఖమ్మం

ఎదులాపురం మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపిక

ఖమ్మం ఫిబ్రవరి ( పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనితను సభ్యులు ఎన్నుకోగా, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగి, సభ్యుల మద్దతుతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ పోకబతిని అనిత, వైస్ చైర్మన్ తమ్మీనేనీ నవీన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం ఫిబ్రవరి
( పున్నమి జిల్లా ఇంచార్జి)

ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనితను సభ్యులు ఎన్నుకోగా, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగి, సభ్యుల మద్దతుతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు సమాచారం.

ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ పోకబతిని అనిత, వైస్ చైర్మన్ తమ్మీనేనీ నవీన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.