శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పెద్ద కన్నలి గ్రామంలో దీర్ఘకాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామస్థులు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, తిరుపతి లోక్సభ సభ్యులు మద్దిల గురుమూర్తి ఎంపీ నిధుల నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం వాటర్ ప్లాంట్ యంత్రాంగం అమరిక పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటిలోగా అన్ని పనులు పూర్తి చేసి ఆదివారం ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ వరంగా మారుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన బియ్యపు మధుసూదన రెడ్డికి, వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో పెద్ద కన్నలి త్రాగునీటి సమస్య పరిష్కారం