శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరులో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం గ్రాండ్ హోటల్లో బస చేశారు. అనంతరం ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మయూర్, ఆయన సతీమణి గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి, ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున నాయుడు, గుడ్లూరు భాగ్యలతలను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. తదుపరి వారు అందరూ కలిసి ఊరందూరు గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంజీఎం గ్రూప్ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గృహప్రవేశంలో ఎమ్మెల్సీ గ్రీష్మ