Friday, 13 March 2026
  • Home  
  • ఊటుకూరు హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఊటుకూరు హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు భోగినేని కాశీరావు. జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమ కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన ఘట్టమని తెలిపారు. సమాజంలో గౌరవం పొందాలంటే, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యతో దేశానికి సేవ చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. భవిష్యత్తుకు పునాది వేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు భోగినేని కాశీరావు.
జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమ కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన ఘట్టమని తెలిపారు. సమాజంలో గౌరవం పొందాలంటే, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యతో దేశానికి సేవ చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. భవిష్యత్తుకు పునాది వేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.