ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ మట్ల వెంకట రమణయ్య గారి మృతి వార్త తెలిసి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చుతూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
గ్రామానికి, పార్టీకి సేవ చేసిన నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.20 వేల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



