పున్నమి అక్టోబర్ 16: CPM పార్టీ నుండి వరుసగా 5 సార్లు MLA గా ఇల్లెందు నియోజకవర్గము నుండి గెలిచిన గుమ్మడి నరసయ్య గారు.
ఇప్పటికి కూడా సైకిల్ పై వెళ్లడం RTC బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన అక్కడ అందరితో పాటే OP చీటీ తీసుకు వైద్యుల గది ముందు వరుసలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు.
ఈరోజుల్లో వార్డు మెంబర్, ఎంపీటీసీలు హంగు ఆర్బాటలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి గుమ్మడి నరసయ్య గారు ఎంత సింపుల్ గా ఉంటారో…?
ఇప్పటి రాజకీయ నాయకులు గుమ్మడి నరసయ్య గారిని ఎవరైనా ఆదర్శవంతంగా తీసుకుంటారా?

ఈ ఫోటోలో వరుసలో నిలబడ్డ వ్యక్తిని గుర్తించారా?
పున్నమి అక్టోబర్ 16: CPM పార్టీ నుండి వరుసగా 5 సార్లు MLA గా ఇల్లెందు నియోజకవర్గము నుండి గెలిచిన గుమ్మడి నరసయ్య గారు. ఇప్పటికి కూడా సైకిల్ పై వెళ్లడం RTC బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన అక్కడ అందరితో పాటే OP చీటీ తీసుకు వైద్యుల గది ముందు వరుసలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈరోజుల్లో వార్డు మెంబర్, ఎంపీటీసీలు హంగు ఆర్బాటలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి గుమ్మడి నరసయ్య గారు ఎంత సింపుల్ గా ఉంటారో…? ఇప్పటి రాజకీయ నాయకులు గుమ్మడి నరసయ్య గారిని ఎవరైనా ఆదర్శవంతంగా తీసుకుంటారా?

