Tuesday, 31 March 2026
  • Home  
  • ఈశ్వరీదేవి ఊరేగింపు: శాంతిభద్రతలపై పోలీసుల సమీక్ష
- అన్నమయ్య

ఈశ్వరీదేవి ఊరేగింపు: శాంతిభద్రతలపై పోలీసుల సమీక్ష

-కేఎస్ అగ్రహారం ఉత్సవాల దృష్ట్యా చిట్వేలి పీఎస్‌లో శాంతి కమిటీ సమావేశం -శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరిన కోడూరు రూరల్ సీఐ చిట్వేలి, డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం, కేఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న ఈశ్వరీదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో కోడూరు రూరల్ సీఐ ముఖ్య నేతలు, అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈశ్వరీదేవి ఊరేగింపును అత్యంత శాంతియుత వాతావరణంలో, ఇతర మతాల మనోభావాలకు భంగం కలిగించకుండా నిర్వహించాలని సీఐ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు.ఊరేగింపు నిర్ణీత మార్గాల్లో మాత్రమే జరిగేలా చూడాలని, ప్రజలు ఎవరూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ పాటించాలని సూచించారు.సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఊరేగింపు కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందిస్తామని, పోలీస్ శాఖ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.శాంతి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్సవాల నిర్వహణలో కచ్చితంగా అమలు చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సీఐ తెలిపారు.

-కేఎస్ అగ్రహారం ఉత్సవాల దృష్ట్యా చిట్వేలి పీఎస్‌లో శాంతి కమిటీ సమావేశం

-శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరిన కోడూరు రూరల్ సీఐ

చిట్వేలి, డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం, కేఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న ఈశ్వరీదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో కోడూరు రూరల్ సీఐ ముఖ్య నేతలు, అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈశ్వరీదేవి ఊరేగింపును అత్యంత శాంతియుత వాతావరణంలో, ఇతర మతాల మనోభావాలకు భంగం కలిగించకుండా నిర్వహించాలని సీఐ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు.ఊరేగింపు నిర్ణీత మార్గాల్లో మాత్రమే జరిగేలా చూడాలని, ప్రజలు ఎవరూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ పాటించాలని సూచించారు.సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఊరేగింపు కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందిస్తామని, పోలీస్ శాఖ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.శాంతి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్సవాల నిర్వహణలో కచ్చితంగా అమలు చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సీఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.