*ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం* దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్గోల్డ్గా మార్చేందుకు యత్నించారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేయగా విషయం వెలుగుచూసింది. తనిఖీలో సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


