కామారెడ్డి, 24 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
మహిళా శక్తికి ప్రతీకగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు రామారెడ్డి మండల కేంద్రంలో ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ వేడుక ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది.గౌరవ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి శ్రీ మదన్ మోహన్ ఆదేశాల మేరకు, స్థానిక అధికారులు, గ్రామ మహిళా సంఘాల సభ్యులు, మండల కాంగ్రెస్ నేతలు, యూత్ నాయకులు సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సభా ప్రాంగ ణం కళాత్మక పందిరులతో, పూల సింగారాలతో ముస్తాబై, ఆనందఝరులు వెల్లువెత్తాయి. మహి ళలకు చీరలను అందజేస్తూ పార్టీ నాయకులు సామాజిక సమానత్వం, మహిళా సాధికారత గురించి ప్రస్తావించారు. వేడుకలో పాల్గొన్న మహిళలు చిరునవ్వులతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చల్లని గాలిలో ఉత్సాహంతో చిందులేసిన ఆ క్షణాలు రామారెడ్డి ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు లేగల ప్రసాద్, మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు అంజవ్వ, సెక్రెటరీ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ మహీళలు, తదితరులు పాల్గొన్నారు


