Tuesday, 24 February 2026
  • Home  
  • ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
- E-పేపర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పున్నమి న్యూస్ ప్రతినిధి 24 ఫిబ్రవరి 2026 జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: రంగారెడ్డి జిల్లా ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత ఆర్డీఓలు, ఎంపిడిఓలు, ఆర్.సి.లు, పోలీస్ శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి మార్చ్ 18వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సప్ గ్రూప్ చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాలలో ఎగ్జామ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 200 పరీక్షా కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు, జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదని, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా పరిశీలించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, సరిత, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి, పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి
24 ఫిబ్రవరి 2026
జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్:

రంగారెడ్డి జిల్లా
ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి చిన్న తప్పిదాలకు తవ్వివకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత ఆర్డీఓలు, ఎంపిడిఓలు, ఆర్.సి.లు, పోలీస్ శాఖ అధికారులు, విద్యుత్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ బుధవారం నుండి మార్చ్ 18వ తేదీ వరకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టవలసిన పనులను సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో వాట్సప్ గ్రూప్ చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాలలో ఎగ్జామ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 200 పరీక్షా కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు, జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 31 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదని, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా పరిశీలించాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, సరిత, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితా దేవి, పోలీస్ అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.