ఆర్ ఎస్ ఎస్ దేశానికి పట్టిన విషం
పోరాటాలతో కార్పొరేట్ల దోపిడీ నియంత్రణ
సీఐటీయూ నాకిష్టమైన సంఘం
సినీ నటుడు ప్రకాష్ రాజ్
*విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- *
“100 ఏళ్ళ ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ నుంచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారి ఒక్క పేరు చెప్పగలరా.? ఈ వందేళ్లలో చెడ్డీ ల నుంచి ప్యాంటు లకు వచ్చారు తప్ప సాధించింది ఏమీ లేదని ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ ఎద్దేవాచేశారు. కమలం పువ్వు కింద ఉన్న విషపు వేళ్లను చూస్తే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఈ దేశానికి పట్టిన విషం. అని అన్నారు. భారతదేశం సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ ఎస్ ఎస్ అని వ్యాఖ్యానించారు. సీఐటీయూ అలిండియా మహాసభలు 31 నుంచి జనవరి 4వరకూ విశాఖ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న సందర్బంగా 27న శ్రామిక్ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖకు శనివారం విచ్చేసిన అయన దసపల్ల హోటల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు..
కార్మికుల కోసం పోరాడే వారంటే నాకెంతో ఇష్టం. సీఐటీయూ పిలవగానే వచ్చేశాను అని తెలిపారు. నేను నటుడుని మాత్రమే కాదు. అభ్యుదయ ఆలోచనలు ఆందోళనలకు అండగా ఉంటాను అన్నారు. సీఐటీయూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావడం నా బాధ్యత… చెమట చుక్కకి ఓటమి ఉండదన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించడంపై స్పందిస్తూ అమ్మేవాడు ఒకడు కొనేవాడు ఒకడు.. కళ్ళముందే వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటె ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడు పోయారు కాబట్టి అని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా విమాన యాన రంగం పెద్దోళ్ళు చేతుల్లో ఉండడం వీరికి ప్రభుత్వాలు అమ్ముడు పోవడం కల్లారా చూసామని విమర్శించారు..
ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులు రాజ్యాంగ యంత్రం వారి చేతిలో ఉన్నాయి కదా పిడి చట్టాలు పెడతారు, స్థాన్ స్వామికి స్ట్రా కూడా ఇవ్వరు, గౌరీ లంకేశ్ ని చంపిన వారు బెయిల్ పై బయటకి వచ్చేస్తారు.. వారికి ప్రశ్నించే వారు వుండకూడదు. ప్రజలు నిరంతరం ప్రశ్నించడమే మార్గమన్నారు. మెడికల్ కాలేజీలని ఏపీలో పి పి పి పేరుతో అమ్మడం ప్రజలకు నష్టం అని, అసలు ప్రజలు ఎన్నికల్లో ఎవరిని బల పరచాలో నేర్చుకోవాలన్నారు.. కర్ణాటక లోని బెంగళూరు లో 1007 ఎకరాల వ్యవసాయ భూమిని ఇది వరకు ఒకసారి
ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నపుడు ప్రజలంతా కలిసి పోరాడి అప గలిగారన్నారు.
మీ డియా కూడా అమ్ముడు పోయిందని ఎంతో కొంత ఇండిపెండెంట్ మీడియా పని చేస్తుందన్నారు. సినిమాలు మీడియా ద్వారా 90శాతం చెత్తను పాలకులు ఎక్కిస్తున్నారని కేరళ ఫైల్స్ అనే సినిమా తీయించి స్వయంగా మోడీ యే రూ కోట్లు ఖర్చు చేసి సినిమా చూడాలనే కాంపెయిన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.. అబద్దాలతో భయాన్ని కలిగించే సామ్రాజ్యాన్ని దేశంలో పాలక శక్తులు నిర్మిస్తున్నాయని ప్రజలు అనునిత్యం పోరాడాలని ఈ వ్యవస్థ ను అర్ధం చేసుకుని పోరాడేలా సీఐటీయూ వంటి సంస్థ లు చేస్తున్నాయని అభినందించారు..
శివాజీ మాటలపై ఆగ్రహం ఆడవాళ్ళ పై శివాజీ మాటలు అహంకారం తో కూడినవి అని అన్నారు. వేదికల మీద మాట్లాడేప్పుడు ఒళ్ళు, భాష జాగ్రత్తగా ఉండాలన్నారు.అనసూయకు నా మద్దతు….అని ప్రకాష్ రాజ్
అన్నారు..మహిళలను కు సంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ళ అవయవాలు మాత్రమే కనిపిస్తాయి…..అన్నారు
ఐ బొమ్మ రవి దొంగ తనం చేశాడు….
దొంగ…దొంగే….? అంటూ స్పందించారు..
టికెట్ధ ధరలు పెరిగితే ప్రజలు సినిమాలు చూడొద్దు అని సలహా ఇచ్చారు. మావోయిస్టుల ఎన్ఈకౌంటర్ పై మాట్లాడుతూ.. వారు ఎందుకు ఆలా మారారో తెలుసుకుని చర్చలు జరపాలి తప్ప టెర్రరిస్ట్ ల మాదిరి కాల్చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు.. ఈ సమావేశం
లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నరసింగరావు,
అధ్యక్షులు మాజీ ఎమ్ ఎల్ ఏ
ఎమ్ ఏ గపూర్, అలిండియా సీఐటీయూ నాయకులు కందారపు మురళీ పాల్గొన్నారు.


