ఆఫ్షియల్ కాలనీ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
విశాఖ గాజువాక అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి):
జీవీఎంసీ 72 వార్డ్ ఆఫ్షియల్ కాలనీ లో LG ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మవారి నవరాత్రి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జనసేన సీనియర్ నాయకులు ఎర్ర నాగేశ్వరావు ముఖ్య అధితి గా విచ్చేసి మండపం లో ఏర్పాటు చేసిన లోక రక్ష హోమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎర్ర నాగేశ్వరావు మాట్లాడుతూ శక్తీ స్వరూపిణి ఇంద్ర కీలాద్రి పై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు ఉత్సవల్లో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు. లోక రక్షణ, శిష్ట రక్షణ లో భాగంగా ఈ మండపం లో నిర్వహించిన హోమం లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం శుభపరిణామన్నారు. హిందూ బంధువులు చేసుకునే అతి పెద్ద పండగల్లో దసరా ఒకటి అని లోకమాత దుర్గాదేవి వల్లే మన అందరం సుఖసంతోషాలతో ఉన్నామన్నారు. దసరా ఉత్సవాలు ల్లో భాగంగా LG ఉత్సవ కమిటీ దిలీప్, జగదీశ్, ఆహ్వానం మేరకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నానన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీనివాస్ వర్మ, ప్రసాద్,లాయర్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు,మధుసూదన్ రావు,తేజ,లోకేష్,సంతోష్, సంపత్, సుబ్బు,గణేష్ మరియు మహిళ లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


