*సాంస్కృతిక కార్యక్రమాలు.. అబ్బురపరిచిన విద్యార్థులు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 30/03/ 2026*
*స్థానిక బికే రెడ్డి కాలనీ ఆటో స్టాండ్ యందు శివాలయం లో మహబూబ్నగర్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది పైచిలుకు విద్యార్థులుసాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అబ్బురపరిచాయి విద్యార్థులు వివిధ ప్రాచీన ఘట్టాలకు సంబంధించిన రామ నామం, రామాయణం గురించి తెలియజేస్తూ వాటి విశిష్టతను తెలియజేస్తూ నృత్య రూపంలో అద్భుత ప్రదర్శన చేశారు భక్తులను వారి నృత్యం, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వారి నృత్యాన్ని భక్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, నృత్య శిక్షకురాలు విజయలక్ష్మి, మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు*


