జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (పున్నమి ప్రతినిధి):
ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రాంనగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు దాతల సహకారంతో షూస్ మరియు ప్లేట్స్ పంపిణీ చేశారు. ప్లేట్స్ను శ్రీలత బిక్షపతి గార్లు (KTK – 1 Incline) విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. గోవర్ధన్ సర్ పిల్లలకు షూస్ అవసరం ఉందని తెలియజేయడంతో దాతల సహాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోవర్ధన్ సర్, ఉపాధ్యాయిని అపర్ణ మేడం, దాతలు మల్లేష్ గారు, సొసైటి సభ్యులు క్రాంతికుమార్, షాకీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


