Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆత్మకూరులో ఎన్నికల తీరును పరిశీలించిన ఆర్డీవో బి.పావని

Punnami Newsroom Published:
ఆత్మకూరులో ఎన్నికల తీరును పరిశీలించిన ఆర్డీవో బి.పావని

Story highlights

  • ఆత్మకూరు నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆర్డీవో పర్యవేక్షణ ఆత్మకూరు, నవంబర్ 5: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆర్డీవో బి.పావని పరిశీలించారు.
  • ఆత్మకూరు, సంగం ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.
  • పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆర్డీవో పర్యవేక్షణ

ఆత్మకూరు, నవంబర్ 5: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆర్డీవో బి.పావని పరిశీలించారు. ఆత్మకూరు, సంగం ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు. పోలింగ్ నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *