రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో “రామ్మన్న ఆత్మీయ భరోసా” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో 93 మందికి పైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
సిరిసిల్ల–ముస్తాబాద్ రూట్ ఆటో యూనియన్ అధ్యక్షులు కోటగిరి కనకయ్య మాట్లాడుతూ, వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో KTR అండగా నిలిచారని తెలిపారు. అనంతరం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించి భరోసా కలిగించారని చెప్పారు.
అలాగే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉచిత చికిత్స అందించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించిన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామలక్ష్మణపల్లె, తుర్కపల్లె, ఆవునూర్ గ్రామాల సర్పంచులు, భారత రాష్ట్ర సమితి BRS గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యువత సభ్యులు, కార్యకర్తలు మరియు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



