Sunday, 1 March 2026
  • Home  
  • అసహజం మాటున నిజం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

అసహజం మాటున నిజం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

నేటి సామాజిక, ఆర్థిక పర్యావరణ కాలుష్య ప్రభావంతో మారిపోతున్న మనిషి మనోదృశ్యరూపకం … ఈ కవిత భౌతిక అకర్షణను ప్రేమ అంటున్నారు గాని కన్నవారి ప్రేమను అర్థం చేసుకోలేకున్నారు. సారం లేని సహజీవనాన్ని సంసారం అంటున్నారు గాని సర్వం అర్పించే కుటుంబ బంధాలు భారమంటున్నారు. ఆస్తుల పంపకాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు గాని ఉమ్మడికుటుంబ విలువలు మరచిపోతున్నారు. సంస్కార రహిత సరదాలను సంస్కృతి అంటున్నారు గాని సామాజిక ఆదర్శాలను అనగదొక్కుతున్నారు. గ్రాఫిక్ జిమ్మిక్కుల చిత్రాలకు జైకొడుతున్నారు గాని జీవన ఆరాటానికై పోరాటాలకు వెల కట్టలేకున్నారు. డ్రమ్ముల దరువులమ్యాజిక్తో చిందులేస్తున్నారు గాని సంగీత ప్రవాహమైన ప్రకృతిని ఆస్వాదించలేకున్నారు. ఆస్తులంతస్తులున్నవాన్నే గొప్పవాడంటున్నారు గాని ఆప్యాయతానురాగాలను గాలికొదిలేస్తున్నారు. మందు పార్టీలిచ్చే వాడినే స్నేహితుడంటున్నారు గాని ముందుతరాలకు మార్గం చూపేవాడిని పిచ్చోడంటున్నారు. నిజాయితీపరులను అసమర్ధులంటున్నారు గాని నటించి నమ్మించే వారిచే మోసపోతున్నారు. లాభం ఏదైనా ఎగబడుతున్నారు గాని నిజం పలికితే మాత్రం పగబడుతున్నారు. భుక్తి కోసం భవిష్య విద్య అంటున్నారు గాని స్వలాభ కాంక్షతో సంఘ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు ప్రశాంతతలేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. జనజీవన పరమార్ధం సుఖవంతం దైవం గా భావిస్తే ధర్మతత్వం వాస్తవిక దారిలో జీవితం అవని పై జనహితం. అసహజం మాటున నిజం నేటి జన జీవన సమాజం పరిశీలనే మనోనేత్ర తేజం

నేటి సామాజిక, ఆర్థిక పర్యావరణ కాలుష్య ప్రభావంతో మారిపోతున్న మనిషి మనోదృశ్యరూపకం … ఈ కవిత

భౌతిక అకర్షణను ప్రేమ
అంటున్నారు గాని
కన్నవారి ప్రేమను అర్థం చేసుకోలేకున్నారు.

సారం లేని సహజీవనాన్ని
సంసారం అంటున్నారు గాని
సర్వం అర్పించే కుటుంబ బంధాలు భారమంటున్నారు.

ఆస్తుల పంపకాన్ని అభివృద్ధి
వికేంద్రీకరణ అంటున్నారు గాని
ఉమ్మడికుటుంబ విలువలు మరచిపోతున్నారు.

సంస్కార రహిత సరదాలను
సంస్కృతి అంటున్నారు గాని
సామాజిక ఆదర్శాలను అనగదొక్కుతున్నారు.

గ్రాఫిక్ జిమ్మిక్కుల చిత్రాలకు
జైకొడుతున్నారు గాని
జీవన ఆరాటానికై పోరాటాలకు వెల కట్టలేకున్నారు.

డ్రమ్ముల దరువులమ్యాజిక్తో
చిందులేస్తున్నారు గాని
సంగీత ప్రవాహమైన ప్రకృతిని ఆస్వాదించలేకున్నారు.

ఆస్తులంతస్తులున్నవాన్నే
గొప్పవాడంటున్నారు గాని
ఆప్యాయతానురాగాలను గాలికొదిలేస్తున్నారు.

మందు పార్టీలిచ్చే వాడినే
స్నేహితుడంటున్నారు గాని
ముందుతరాలకు మార్గం చూపేవాడిని పిచ్చోడంటున్నారు.

నిజాయితీపరులను
అసమర్ధులంటున్నారు గాని
నటించి నమ్మించే వారిచే మోసపోతున్నారు.

లాభం ఏదైనా
ఎగబడుతున్నారు గాని
నిజం పలికితే మాత్రం పగబడుతున్నారు.

భుక్తి కోసం భవిష్య విద్య
అంటున్నారు గాని
స్వలాభ కాంక్షతో సంఘ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు
ప్రశాంతతలేని జీవితాన్ని అనుభవిస్తున్నారు.

జనజీవన పరమార్ధం సుఖవంతం
దైవం గా భావిస్తే ధర్మతత్వం
వాస్తవిక దారిలో జీవితం
అవని పై జనహితం.
అసహజం మాటున నిజం
నేటి జన జీవన సమాజం
పరిశీలనే మనోనేత్ర తేజం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.