संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అల్లూరి జిల్లాలో 21 అభివృద్ధి పనులకు అనుమతులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అల్లూరి జిల్లాలో 21 అభివృద్ధి పనులకు అనుమతులు

खबर की मुख्य बातें

  • అల్లూరి జిల్లాలో రహదారులు, డిజిటల్ నెట్‌వర్క్, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి సంబంధించి 21 ప్రతిపాదనలకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) ఆమోదం తెలిపింది.
  • శనివారం కలెక్టర్ నిషాంతి.టి అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • ఇందులో 16 రహదారి నిర్మాణ పనులు, ఒక బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్, నాలుగు అంగన్‌వాడీ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి.

అల్లూరి జిల్లాలో రహదారులు, డిజిటల్ నెట్‌వర్క్, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి సంబంధించి 21 ప్రతిపాదనలకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టర్ నిషాంతి.టి అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 16 రహదారి నిర్మాణ పనులు, ఒక బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్, నాలుగు అంగన్‌వాడీ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. హుకుంపేట, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, అనంతగిరి మండలాల్లో రహదారుల విస్తరణ, బీటీ రోడ్ల నిర్మాణానికి అటవీ భూముల అనుమతులను పరిశీలించి ఆమోదించారు. పెదబయలు మండలంలో గుల్లెలు నుంచి ములుగువీధి వరకు ఓఎఫ్‌సీ లైన్ ఏర్పాటుకు 0.03 హెక్టార్ల అటవీ భూమి ప్రతిపాదనను ఆమోదించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సబ్ కలెక్టర్ కె.సాహిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *