*అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి*
— *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని వైసీపీ నాయకులు, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.
గురువారం వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని అభిలాషించారు.
ఎదుటివారికి సహాయం చేయాలనే సద్గుణం కూడా ఉండాలని పేర్కొన్నారు.
కోరిన వరాలు ఇచ్చే కనకమాలక్ష్మి అమ్మవారు ఎంతోమంది జీవితాలలో తన అద్భుత మహత్యాలతో కొత్త వెలుగులు నింపారని కొనియాడారు.
ఆమె చల్లని చూపు అందరి మీద ఉండాలని,
ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో తమ కుటుంబాలతో ఆనందంగా గడపాలని, ఆ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
తప్పకుండా ఈసారి అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుందని అభిలాషించారు.


