అమృత సంవాదం ద్వారా రైల్వే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలి
తల్లెం భరత్ కుమార్ రెడ్డి
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31
( పున్నమి న్యూస్ ప్రతినిధి )
అమృత సంవాదం ధ్వారా ఎంపికైన రాజంపేట రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని గుంతకల్లు రైల్వే డిఆర్ యుసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి అన్నారు. రైల్వే అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో గుంతకల్ రైల్వే డిఆర్ యుసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో అమృత సంవాదం ద్వారా తొలి విడతలో మంజూరైనా
20 కోట్ల రూపాయల నిధులతో రైల్వేస్టేషన్ లో ఎక్స్ లేటరు,లిఫ్టు,
నీటికుళాయిల సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్ వద్ద అదనంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో
సాంప్రదాయంగా వైభవంగా నిర్వహించే బలిజపల్లి గంగమ్మ జాతర సారేకు ఇబ్బంది కలగకుండా ట్రస్ పాస్ ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ కేంద్ర బిందువు101 రైల్వే స్టేషన్ ఆనుకొని అండర్ బిడ్జి ఏర్పాటు చేయాలని, రైల్వే విశ్రాంతి గది, అదనపుస్టాపేజెస్ ,
పార్సల్ గదులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎకశిల నగరం ఒంటిమిట్ట రామాలయ పుణ్యక్షేత్రంలో ప్లాట్ ఫామ్,షెల్టర్,రైలు అదనంగా నిలిలపాలన్నారు.
రైల్వే కోడూరు ఆర్చ్, అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలలో విద్యుదీకరణ,సీసీ కెమెరాలు ఏర్పాటు, సన్ రూప్,ప్రముఖ పుణ్యక్షేత్రంఅరుణాచలం, వైద్యసదుపాయం కొరకు విఎంసి హాస్పిటల్ సులువుగా ప్రయాణించుటకు గుంటూరు ఎక్స్ప్రెస్ తీరునామాలైకు పొడిగించాలన్నారు.
హరిప్రియ ఎక్స్ప్రెస్ ను రైల్వేకోడూరు, రెడ్డిపల్లిలలో నిలపాలని కల్పించి నందలూరు స్టేషన్ లో వాటర్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.నంద్యాల రేణిగుంట డెమో శేట్టిగుంట,పుల్లంపేట నిలపాలని ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్ లో హరిప్రియ ఎక్స్ప్రెస్ ,తిరుమల ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిలపాలని నందదలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ డిఎన్ సుదర్శన్ రెడ్డి,అసిస్టెంట్ కమిషనర్ రాజగోపా రెడ్డి,
ఎలక్ట్రికల్ డి ఈ శ్రీనివాసులు,ఏడియన్ వాసుదేవనాయుడు, వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు, మునిసిపల్ కౌన్సిలర్ సనిసెట్టి నవీన్ కుమార్ , సీసీ జనార్దన్ రెడ్డి, ఐ ఓ డబ్ల్యు దినేష్ రెడ్డి, స్టేషన్ మాస్టర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


