*అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు టర్నల్ చౌట్రీ అన్న క్యాంటీన్ ను ఆకస్మితి తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం భోజన సమయంలో కాంటీన్ వచ్చిన వారితో మాట్లాడి సమయానికి తెరుస్తున్నారా లేదా ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందని, ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతలో ఏటువంటి సమస్య తలెత్తకూడదని నిర్వహణకు తెలిపారు .రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా, ప్రజా శ్రేయస్సుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…


