కామారెడ్డి జిల్లా, 8 అక్టోబర్ పున్నమి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, హోటల్ గంగయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో బాధపడుతూ, మరణించిన విషయం తెలిసిం దే. ఈనేపథ్యంలో,మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి శనివారం అన్నారం గ్రామంలోని గంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు.గంగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పిన మోహన్ రెడ్డి, గంగయ్య మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల గంగయ్య కు ఉన్న నిబద్ధత, ఆయన చేసిన సేవలను కొని యాడారు. గంగయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మోహన్ రెడ్డితో పాటు సల్మాన్, రగోత్తం, ఖాసీం, చిన్న గంగ రెడ్డి, దయానంద్, ఎల్లం, దివంగత గంగయ్య కుటుంబ సభ్యులు, పలువురు కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


