
ప్రజా ధనంతో జీవీఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యాయన యాత్రకు జైపూర్ మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఇంకో 6,7 నెలల్లో జీవీఎంసీ పాలన సమయం ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు అధ్యాయన యాత్ర చేపట్టడంలో అర్ధం లేదని, నగరంలో చాలా సమస్యలకు ఈ 6,7 నెలల్లో కృషి చేయవచ్చని ప్రజా ధనం దుర్వినియోగం చేయడానికి తప్పా ఈ యాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు.
కొద్ది నెలల క్రితం ఇదే కార్పొరేటర్ల బృందం అధ్యాయన యాత్రకు వెళ్లారని కాని ఏం అధ్యాయనం చేసారు, ఏం అమలు చేసారో చెప్పలేదు, కాని కొందరు కార్పొరేటర్లు మద్యం తాగుతూ నృత్యం చేసిన వీడియోలు భయటకి వచ్చాయని, ప్రజా ధనంతో జల్సాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ఆమె ప్రశ్నించారు.
ఇప్పుడు మళ్లీ అధ్యాయన యాత్రకు వెళ్లారు, మీరు ఏం అధ్యాయనం చేస్తున్నారో ప్రతి రోజు ఫోటోలు, వివరాలు మీడియాకు విడుదల చేయాలని ప్రియాంక డిమాండ్ చేసారు.

