విశాఖపట్నం సిటీ పోలీస్ గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
గాజువాకలో ట్రక్ డ్రైవర్ హత్య నగదు, సెల్ ఫోన్ దొంగలించి పరారైన అంత: రాష్ట్ర నిందితులు-
దొంగిలించిన ఆస్తి స్వాధీనం
తేది:15.10.2025 న గాజువాక పోలీస్ స్టేషన్లో ఒక అసహజ మరణం కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుదారుడు నజీబ్ హుస్సేన్ తన సోదరుడు మిరాజ్ హుస్సేన్ (వయస్సు 35సం.లు), ట్రక్ డ్రైవర్, ఎస్.కె రోడ్ వేస్ సంస్థకు చెందినవాడు, బూకెల్ గ్రామం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నివాసి, తన ట్రక్ లోనే మృతి చెందినట్లు తెలిపాడు. ఆ ట్రక్ నంబరు CG-06HA-7988, ఆటోనగర్ రోడ్, రామా ఎంటర్ప్రైజెస్ ఎదురు, గాజువాక, విశాఖపట్నం వద్ద నిలిపివుండగా మృతదేహం గుర్తించబడింది. ఈ ఘటన 11.10.2025 నుండి 14.10.2025 మధ్య కాలంలో జరిగివుండవచ్చు అని, 15.10.2025 ఉదయం 11:00 గంటలకు పోలీసులకు నివేదించబడింది. ఫిర్యాదుదారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్:461/2025 సెక్షన్ ఆఫ్ లా 194 BNSS అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేయబడింది.
అనంతరం దర్యాప్తు అధికారి అయిన ఎస్.ఐ. చి. హరికృష్ణ గారు సంఘటనా స్థలాన్ని సందర్శించి, సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, రక్తపు మరకలు కలిగిన షర్టు, క్లాత్ పీస్, విరిగిపోయిన పిడి గల ఇనుప రాడ్ వంటి సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం కింగ్ జార్జ్ హాస్పిటల్ మార్చురీ కి తరలించి, పోస్ట్‌మార్టం చేయించబడింది.
దర్యాప్తులో భాగంగా మృతుని ఉపయోగించిన మొబైల్ ఫోన్ మరియు అతని కాల్ వివరాలు (CDR) పరిశీలించగా, ఆ మొబైల్ ఫోన్ సరైపాలి గ్రామం, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రాంతంలో ఉపయోగిస్తునట్లు గుర్తించబడింది. స్థానిక పోలీస్ సహాయంతో అనుమానితులు A1 ఇండ్రపాల్ @ ఇంద్ర సింగ్ రాజ్‌పుత్ (27 సం.లు), లారీ డ్రైవర్ మరియు A2 రతీ నాయక్ (25 సం.), లారీ క్లీనర్/పెంటర్ పని చేసే వ్యక్తి, ఇద్దరూ సరైపాలి నివాసులని నిర్ధారించబడింది.
తేదీ 25.10.2025 న వీరిని సరైపాలి వద్ద అదుపులోకి తీసుకొని, విచారించిగా ఇద్దరు. నిందితులు ఇంద్రపాల్ మరియు రతీ నాయక్, మద్యం సేవించి లాభం కోసం ట్రక్ డ్రైవర్ మిరాజ్‌ను 13.10.2025 న హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం చోరీ కాబడిన మృతుని యొక్క మొబైల్ ఫోన్ (Realme C67 5G) నిందితుడు A1 వద్ద నుండి తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.
తేదీ 11.10.2025 న ఒడిశా రాష్ట్రంలోని రాయగడ బ్రిడ్జ్ వద్ద మిరాజ్‌ను కలుసుకుని, అతని ట్రక్ కేరడా చెక్ పోస్ట్ వద్ద ఎక్కారు. 13.10.2025 న గాజువాక ఆటోనగరికి చేరిన తరువాత ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం మిరాజ్ హుస్సైన్ దగ్గర కొంత నగదు వున్నట్లు గుర్తించి, ఆనగదు, మరియు మొబైలు ఫోన్ ని దొంగలించలనే వుద్దేశ్యంతో, వాటిని దొంగలించే క్రమంలో మృతిని తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టగా, మిరాజ్ హుస్సైన్ ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత నిందితులు మృతిని దగ్గర వున్న ₹7,000 నగదు, ఒక రిస్టు వాచ్, మొబైల్ ఫోన్ తీసుకొని, ఆయుధాన్ని సమీపంలోని
స్క్రాప్ యార్డ్‌లో దాచిపెట్టి, దువ్వాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళి, ట్రైన్ లో పరారయ్యారు. విచారణలో A1 ఇంద్రపాల్, 10.10.2025 న ఒడిశా రాష్ట్రం సబలపూర్లో మరో వృద్ధుడిని హత్య చేసి ? 5,000 మరియు మొబైల్ దోచుకున్నట్లు కూడా అంగీకరించాడు.
ఇద్దరు నిందితులకు సరైపాలి పోలీస్ స్టేషన్లో పూర్వ చరిత్రలు ఉన్నాయి:
1. Cr.No. 271/2022-U/s 397, 392 r/w 34 IPC ( )
2. Cr.No. 142/2022-U/s 294, 323, 506 IPC
ఇద్దరు నిందితులను 25.10.2025 రాత్రి 21:00 గంటలకు గాజువాక పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేసి, గౌరవకోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, రిమాండ్‌కు పంపించబడింది.
నిందితులు వద్దస్వాధీనం చేసిన చోరీ సొత్తు మరియు హత్య కి ఉపయోగించిన ఆయుధాలు:
మృతుడికి చెందిన Realme C67 5G మొబైల్ ఫోన్,
ఇనుప రాడ్ (సంఘటన స్థలంలో స్వాధీనం).
ఈ హత్య కేసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు ఎస్.ఐ.చి. హరికృష్ణ గారు, PCs 1554, 3975, 1562, అలాగే CLUES మరియు RFSL బృందాలు చేసిన కృషి ప్రశంసనీయం.
నిందితులను అరెస్ట్ చేసి విశాఖపట్నానికి తరలించే సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు, పరిపాలనా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో, శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ కేసు ను ఒక సవాలుగా స్వీకరించి, రెండు రాష్ట్రాల పోలీస్ విభాగాల మధ్య సమన్వయం, మార్గదర్శకత్వం, మరియు అద్భుతమైన మద్దతు అందించడం వలనే నిందితులను విజయవంతంగా విశాఖపట్నంకు రప్పించగలిగారు.
ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం శ్రీ కె. శ్రీనివాసరావు గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సౌత్ క్రైమ్) కి నియమించదమైనది.
శ్రీ శ్రీ శంకబ్రత బాగ్బీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ, ఈ అనుమానాస్పద మరణాన్ని “మర్డర్ ఫర్ గైన్” ను ఛేదించిన గాజువాక పోలీస్ బృందం పై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే శ్రీ కె. పార్తసారథి గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గాజువాక, మరియు ఆయన బృందం చేసిన పరిశోధన ఫలితంగా, గాజువాక హత్య కేసుతో పాటు ఒడిశా రాష్ట్రం అట్టబారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తించలేని హత్య కేసు ను కూడా ఛేదించడ మైనది

