ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05 (పున్నమి న్యూస్) తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట అన్న చందంగా మారింది కొండపల్లి మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతికి పాల్పడుతున్న అధికారుల తీరు. అంతా నేను చూసుకుంటాను మీకేం భయం లేదు అంటూ మున్సిపాలిటీ చైర్మన్ హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్ , మున్సిపాలిటీలోని రెవెన్యూ అధికారి కలిసి మున్సిపాలిటీ పరిదిలోని ఓ భహుళ అంతస్తుల భవనానికి రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు వేసి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు సదరు యజమానికి చెందిన విజయవాడలోని ఓ నగల దుఖాణం నుంచి నజరానాగా బంగారు కానుకలు అందుకున్నారంటూ మనం దిన పత్రికలో వచ్చిన కథనానికి మున్సిపాలిటీలోని ఓ అధికారిణి స్పందించారు. ఆ ఘటనలో తన పాత్ర ఏమీ లేదని చెప్పారు. అయితే చైర్మన్ అంతా నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతోనే మున్సిపాలిటీ కమీషనర్, పన్నులు విధించే రెవెన్యూ అధికారి కలిసి ఆ పని చేశారంటూ చెప్పుకొచ్చారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లు నగల దుఖాణం పేరును కూడా సదరు అధికారిణి మాటల మద్యలో స్పష్టం చేసి మళ్లీ నాలుక కరుచుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉండగా ఇంటి పన్నుల వ్యవహారంలో తనకు ఎటువంటి సంభందం లేదని చెప్పిన అధికారిణి గురించి వాకబు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ టెండర్ లకు సంభందించిన డిజిటల్ కీ తన దగ్గర పెట్టుకొని, కాంట్రాక్టర్ లను తానే డిసైడ్ చేస్తూ భారీ అవినీతికి తెర తీశారని సమాచారం. ఆన్ లైన్ టెండర్ ద్వారా తనకు నచ్చిన గుత్తే దారుకి టెండర్ కనిపించే విధంగా, నచ్చని వారికి టెండర్ కనిపించకుండా చేస్తూ… టెండర్ దక్కించుకున్న వారి వద్ద నుండి నజరానాగా లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో దోచుకోవడంతో పాటు తన కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని జగ్గయ్యపేట నుండి కొండపల్లికి గుత్తే దారుడిగా తీసుకువచ్చి, అతనికి టెండర్ పనులను దోచిపెడుతూ, టెండర్ కు సంభందించిన సమాచారం దాచి పెట్టే విదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ చైర్మన్, అధికారులు కలిసి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ టెండర్ డిజిటల్ కీ ని మేనేజ్ చేస్తూ, అన్నీ పనులను ఆ ఐదుగురు కాంట్రాక్టర్ లకే వచ్చేలాగా చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నంకు చెందిన మరో తోక వీరున్ని కాంట్రాక్టర్ గా ప్రోత్సహిస్తూ రోజు వారీ కొనుగోళ్లను అతడి ద్వారా కొనుగోలు చేయిస్తూ, అతడితో చేతులు కలిపి అతడు రాసిందే రేటు, అతడు వేసిందే బిల్లు అనే విధంగా ఎప్పటి డబ్బులు అప్పుడు దోచుకుంటున్నారనే వాధనలు లేకపోలేదు. మరో కీలకమైన అధికారిణి రెవెన్యూ అధికారితో కలిసి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు, ప్రభుత్వం, ప్రయివేటుకు చెందిన బహుళ అంతస్థుల భవనాలకి గతేడాది కోట్లాది రూపాయల పన్నులను ఖజానాకు రాకుండా తూ తూ మంత్రంగా పన్నులు విధించి, సదరు యజమానికి ఆర్ధీక లబ్ది చేకూర్చినందుకు గాను వద్ద నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు నజరానాగా అందుకున్నారని మున్సిపాలిటీలోని ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు. తూ తూ మంత్రంగా వేసిన పన్నులతో వచ్చిన కొద్ది మొత్తం నిధులను కూడా తోక వీరుడు లాంటి గుత్తేదారులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని కాజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్ అండదండలతోనే అధికారిణులు అక్రమాలకు పాల్పడ్డారని అధికారులే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కొసమెరుపు. అయితే ఆ విధంగా వచ్చిన అవినీతి సొమ్ములో కొంత మొత్తాన్ని తమకు అనుకూలంగా వార్తలు రాసే వారికి నెలా వారి మామూళ్లుగా ఇస్తూ కొంతమంది అసత్య కథనాలు రాసే వారితో తప్పుడు కథనాలను వండి వారుస్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తూ వికటాట్టహాసం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటువంటి అక్రమాలను ప్రశ్నిస్తున్న మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ పైన అవమానకరంగా, వ్యక్తి గత హననం చేస్తూ వార్తలు రాయించడం ఎ ఇ కి వెన్నతో పెట్టిన విద్య అని స్థానికులు చెప్పుకుంటున్నారు. దీని పైన మున్సిపాలిటీ శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు విచారణ చేస్తే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడడంతో పాటు, ప్రజలకు మంచి చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*మూడు పార్టీలలో కర్చీపు వేసుకున్న చైర్మన్ చిట్టిబాబు*
కొండపల్లి అడవి క్వారీకి సమీపంలో సర్వే నెంబర్ 143, 26/2 లలో మైనింగ్ శాఖ కళ్లు గప్పి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తాను చైర్మన్ ను అని ఏమైనా నేను చూసుకుంటాలే అని అధికారులను మభ్య పెడుతూ విజయవాడలోని ఇళ్ల ప్లాటులకు ప్రతీ రోజు వంద నుండి 150 లారీల మట్టిని తరలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పటాపంచలతో కలిసి భూధేవికి ఓట్లేయాలంటూ వసంతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారంటూ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పైన సొంత పార్టీ నేతలే విమర్శలు సందిస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ వసంతకు చేరడంతో పటాపంచలను వసంత దూరం పెట్టారని సమాచారం. అయితే రామచంద్ర యాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో వసంతకు వ్యతిరేకంగా టిడిపి ఓట్లు చీల్చడం ద్వారా తన సామాజిక వర్గానికి చెందిన వైసిపి అభ్యర్ధి సర్నాల తిరుపతిరావును గెలిపించేందుకు శతావిధాల శక్తి వంచన లేకుండా చిట్టి చిట్టి ప్రయత్నాలు చేశారని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అందులో బాగంగానే వైసిపి అనుకూల మీడియాతో అంటకాగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బివై పార్టీ కార్యాలయం ఆవిష్కరణ సభకు మనుషులను తరలించేందుకు గాను తన సొంత నిధులతో బస్సులను కూడా ఏర్పాటు చేసి అందరినీ విశ్మయానికి గురి చేశారని చెప్పుకుంటున్నారు. తాను టిడిపిలో ఉంటూ, తన అన్న కుమారుడిని వైసిపిలో ఉంచుతూ మరో భూదేవిని బివై పార్టీలోకి పంపి మూడు పార్టీలలో తన హవా నడిపిస్తున్నరని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చైర్మన్ చిట్టిబాబు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ఊహా గానాలు వినిపిస్తున్నాయి.


