संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

(పున్నమి ప్రతినిధి)వేముల, అక్టోబర్ 6: వేముల మండలంలోని వేముల, వి.కొత్తపల్లి గ్రామ పంచాయతీల్లో సేంద్రియ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వేముల గ్రామ పంచాయతీ SWPCలో సిద్ధం చేసిన రెండు వర్మీ తొట్లలో, వి.కొత్తపల్లి SWPCలో ఒక వర్మీ తొట్టిలో వానపాములను వదిలారు.

వర్మీ తొట్లలో పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాలను తగిన పద్ధతిలో వినియోగించి వానపాముల సహాయంతో నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేయనున్నారు. దీంతో గ్రామాల్లో సేంద్రియ వ్యర్థాల సమర్థ నిర్వహణతో పాటు రైతులకు ఉపయోగపడే సేంద్రియ ఎరువు అందుబాటులోకి రానుంది.

“వ్యర్థం నుంచి సంపద” లక్ష్యంతో ప్రతి గ్రామ పంచాయతీలో SWPCలను సమర్థవంతంగా వినియోగిస్తూ వర్మీ కంపోస్ట్ తయారీని ప్రోత్సహిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. వర్మీ తొట్ల నిర్వహణ, తేమ పరిరక్షణ, వానపాముల సంరక్షణపై సిబ్బందికి సూచనలు అందించారు. ప్రజలు సేంద్రియ వ్యర్థాలను వేరుచేసి అందించి సహకరించాలని అధికారులు కోరారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ, డీవై ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు (PDOలు), గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో వర్మీ కంపోస్ట్ తయారీకి శ్రీకారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *