Story highlights
- సంగం: మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనిపించకుండా పోవడంతో సంగం పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఈ నెల 19వ తేదీన తల్లిదండ్రులు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక ఇంట్లో కనిపించలేదు.
- దీంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.
సంగం: మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనిపించకుండా పోవడంతో సంగం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 19వ తేదీన తల్లిదండ్రులు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక ఇంట్లో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.