செய்தியின் முக்கிய அம்சங்கள்
- *బొబ్బిలి బెర్రీ పరిశ్రమ ఫర్నస్ పేలుడు ఘటనపై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్* *భారీ ప్రాణనష్టం తప్పడం పట్ల ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం - భద్రతపై మంత్రి కీలక ఆదేశాలు* *విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, అక్టోబర్ 06.(పున్నమి ప్రతినిధి ) బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ…
- పేలుడు సమయంలో అక్కడ కార్మికులు, ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని తెలియగానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాంగంతో వరుస సంప్రదింపులు జరిపారు.
- వెంటనే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన, జిల్లా కలెక్టర్, ఫైర్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు ఆరా తీశారు.
*బొబ్బిలి బెర్రీ పరిశ్రమ ఫర్నస్ పేలుడు ఘటనపై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్*
*భారీ ప్రాణనష్టం తప్పడం పట్ల ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం – భద్రతపై మంత్రి కీలక ఆదేశాలు*
*విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, అక్టోబర్ 06.(పున్నమి ప్రతినిధి )
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో జరిగిన భారీ ఫర్నస్ పేలుడు ఘటనపై రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. పేలుడు సమయంలో అక్కడ కార్మికులు, ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని తెలియగానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాంగంతో వరుస సంప్రదింపులు జరిపారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన, జిల్లా కలెక్టర్, ఫైర్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడం అదృష్టం. అయితే ఇది చిన్న విషయం కాదు. ఫర్నస్ ఎందుకు పేలింది? సాంకేతిక లోపమా? నిర్వహణ లోపమా? భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అనే దానిపై లోతైన విచారణ జరగాలి” అని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లోనూ భద్రతా ప్రమాణాలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, ఇటువంటి ప్రమాదాలు ఏ పరిశ్రమలోనూ పునరావృతం కాకుండా పరిశ్రమలను పరిశీలించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. అధికారులనుయి నివేదిక వచ్చిన తర్వాత బాధిత పరిశ్రమకు తగిన సహాయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.