Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవం సందర్భంగా — కౌన్సిలర్ ఎస్ ఉష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

Punnami Newsroom Published: Updated:
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవం సందర్భంగా — కౌన్సిలర్ ఎస్ ఉష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

విద్యార్థులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి – కౌన్సిలర్ ఎస్. ఉష

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 30. (పున్నమి ప్రతినిధి )

విజయనగరం జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవం సందర్భంగా కొత్తవలస మండలం గొల్లపేట (కేపీటీ) మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఎస్. ఉష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు, సానుకూల ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి మానసిక ఆందోళనలు ఎదురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు కౌన్సిలర్ల సలహాలు తీసుకోవాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి సుశీల, ఉపాధ్యాయులు కే. సూర్యకళ, షేక్ సలీం, కే. బాబు నాయుడు, వి. ప్రసాద్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవం సందర్భంగా — కౌన్సిలర్ ఎస్ ఉష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *