Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

కొత్తూరు గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ తరఫున ఇంటింటి ప్రచారం

Punnami Newsroom Published:
కొత్తూరు గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ తరఫున ఇంటింటి ప్రచారం

Story highlights

  • కొత్తూరు గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ తరఫున ఇంటింటి ప్రచారం 500 మంది కార్యకర్తలతో ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 29.పున్నమి ప్రతినిధి కంటకాపల్లి: గ్రామపంచాయతీ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి గంగమ్మ తరఫున ఈరోజు…
  • సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు.
  • ఈ సందర్భంగా నాగిశెట్టి గంగమ్మ కుమారుడు, మాజీ ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి రమణ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన తల్లి నాగిశెట్టి గంగమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కొత్తూరు గ్రామంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి గంగమ్మ తరఫున ఇంటింటి ప్రచారం

500 మంది కార్యకర్తలతో ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 29.పున్నమి ప్రతినిధి
కంటకాపల్లి: గ్రామపంచాయతీ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగిశెట్టి గంగమ్మ తరఫున ఈరోజు కొత్తూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా నాగిశెట్టి గంగమ్మ కుమారుడు, మాజీ ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి రమణ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన తల్లి నాగిశెట్టి గంగమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజల మద్దతుతో ఆమెను ఎంపీటీసీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మిడతన కాశి, తూరుబిల్లి ఆనంద్, మాజీ సర్పంచ్ సారిక రమణ, బాద్రిరెడ్డి వెంకటరమణ, బోధల వెంకట్, కొత్త సుంకరపాలెం గ్రామ టీడీపీ పెద్ద సూర్యనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *