Sunday, 5 July 2026
  • Home  
  • నెల్లూరులో “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” గ్రాండ్ ఓపెనింగ్!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” గ్రాండ్ ఓపెనింగ్!

నెల్లూరు నగరంలో యువత, స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు నగరంలో యువతకు ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (VPR), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, షేక్ అబ్దుల్ అజీజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్ మాట్లాడుతూ..నేటి యువతకు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలే భవిష్యత్తుకు బలమైన పునాదులని అన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇన్నోవేషన్ హబ్‌లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నెల్లూరును కేవలం అభివృద్ధి చెందిన నగరంగా మాత్రమే కాకుండా, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ తెలిపారు. నగర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత పెంచుతాయని ఆమె అన్నారు.అనంతరం మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఇతర ప్రముఖులతో కలిసి నెక్సస్ ఇన్నోవేషన్ హబ్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక నమూనాలు, స్టార్టప్ ప్రదర్శనలను పరిశీలించారు. యువ పారిశ్రామికవేత్తలను అభినందిస్తూ, వారి వినూత్న ఆలోచనలకు నగర పాలక సంస్థ తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం నెల్లూరు నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా నిలవడంతో పాటు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకు కొత్త ఆశలను నింపిన కార్యక్రమంగా నిలిచింది.

నెల్లూరు నగరంలో యువత, స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” ఘనంగా ప్రారంభమైంది.

నెల్లూరు నగరంలో యువతకు ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “నెక్సస్ ఇన్నోవేషన్ హబ్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (VPR), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, షేక్ అబ్దుల్ అజీజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్ మాట్లాడుతూ..నేటి యువతకు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలే భవిష్యత్తుకు బలమైన పునాదులని అన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇన్నోవేషన్ హబ్‌లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. నెల్లూరును కేవలం అభివృద్ధి చెందిన నగరంగా మాత్రమే కాకుండా, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ తెలిపారు. నగర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత పెంచుతాయని ఆమె అన్నారు.అనంతరం మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఇతర ప్రముఖులతో కలిసి నెక్సస్ ఇన్నోవేషన్ హబ్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక నమూనాలు, స్టార్టప్ ప్రదర్శనలను పరిశీలించారు. యువ పారిశ్రామికవేత్తలను అభినందిస్తూ, వారి వినూత్న ఆలోచనలకు నగర పాలక సంస్థ తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం నెల్లూరు నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా నిలవడంతో పాటు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకు కొత్త ఆశలను నింపిన కార్యక్రమంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.