ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
നിർമൽ

నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • సమస్యలు పరిష్కరించే వరకు BRSV ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం నిర్మల్: నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ BRSV ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
  • BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జా తెలిపారు.
  • ధర్నా కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగా BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జాతో పాటు పలువురు BRSV కార్యకర్తలను ఉదయం 8 గంటల సమయంలో వారి ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సమస్యలు పరిష్కరించే వరకు BRSV ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం
నిర్మల్: నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ BRSV ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జా తెలిపారు.
ధర్నా కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగా BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జాతో పాటు పలువురు BRSV కార్యకర్తలను ఉదయం 8 గంటల సమయంలో వారి ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా షోయబ్ మీర్జా మాట్లాడుతూ.. నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు BRSV ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్ హైమద్, అదుముల్ల విశాల్, నేహాల్ ఖాన్, సయ్యద్ ఫసి, మహ్మద్ ముఖీం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *