संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

నల్లచెరువుపల్లిలో అంగన్వాడి ఉత్సవం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నల్లచెరువుపల్లిలో అంగన్వాడి ఉత్సవం

అంగన్వాడి కేంద్రాలకు చిన్నారులను పంపాలి

(పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 6:వేముల: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నల్లచెరువుపల్లి ఒకటవ, రెండవ అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కే. హసీనా పాల్గొని గర్భవతులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను వివరించారు. మూడు సంవత్సరాలు పూర్తైన చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, కాన్వెంట్లకు పంపకుండా అంగన్వాడి విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటలు, పాటల ద్వారా పిల్లల సమగ్ర శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ప్రతి ఆహార వస్తువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీదేవి, జయ భారతి, సహాయకురాలు ఓలమ్మ, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

నల్లచెరువుపల్లిలో అంగన్వాడి ఉత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *