Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన అడవి దుప్పి

Punnami Newsroom Published:
జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన అడవి దుప్పి

Story highlights

  • వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలోని జాతీయ రహదారిపై అడవి చుక్కల దుప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది.
  • గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి దుప్పిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
  • ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలోని జాతీయ రహదారిపై అడవి చుక్కల దుప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి దుప్పిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. రహదారిపై గాయాలతో పడి ఉన్న వన్యప్రాణిని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి గాయపడిన దుప్పికి వైద్య చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *