Story highlights
- నెల్లూరు: నెల్లూరు–పొట్టేపాలెం రహదారిపై ప్రయాణం వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది.
- రోడ్డుపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
నెల్లూరు:
నెల్లూరు–పొట్టేపాలెం రహదారిపై ప్రయాణం వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డుపై పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో వాటి లోతు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలను గుర్తించడం కష్టంగా మారి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో జొన్నవాడ, నరసింహకొండ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు నెల్లూరు రూరల్, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాలెం తదితర మండలాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. రహదారి దుస్థితితో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.