నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జనాదరణ ఉన్న మన్నెమాల సుకుమార్ రెడ్డి ని ఇటీవల జనసేనా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం జరుగుతున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి విచ్చేయుచున్న తాడేపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు జనసేనా నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి నివాసంలో ఆత్మీయ కలియక జరిగింది.ఈ సందర్భంగా కావలి నియోజక వర్గంలోని కావలి పట్టణం, అల్లూరు, పాత బిట్రగుంట, కడనూతల మాజీ సర్పంచులు,యం.పి టి సి లు మరియు వార్డు మెంబెర్స్, కావలి రూరల్ మండలం నుండి మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ , బీసీ ( వడ్డెర ) నాయకులు, రాజావారి చింతల పాలెం, ముసునూరు నుండి నాయకులు సుమారు 400 మంది పైగా వైసీపీ నేతలకు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసులు సమక్షంలో జనసేనా పార్టీ కండువేసుకున్నారు.



